Tuesday, April 23, 2024

2020-21లో రూ.9.45 లక్షల కోట్ల పన్ను వసూళ్లు

దేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో అధిక పన్నులు వసూలయ్యాయి. లక్ష్యాన్ని మించి ప్రత్యక్ష పన్నులు వసూలయినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఆర్థక సంవత్సరంలో రూ.9.45 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలైనట్టు కేంద్రం ప్రకటించింది. బడ్జెట్ అంచనాల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.05 లక్షల కోట్లు ఉంటాయని అంచనాలు కట్టింది కేంద్రం. అయితే..అంతకంటే 5 శాతం ఎక్కువే పన్నులు వసూలయ్యాయి. కరోనా సంక్షోభంలోనూ ఈ మేర వృద్ధి సాధించడం పట్ల అధికారుల హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్ను రూ.4.57 లక్షల కోట్ల వసూళు అయ్యాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ.4.71 లక్షల కోట్లు కాగా, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను రూపంలో రూ.16,927 కోట్లు వసూలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement