Wednesday, November 6, 2024

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు.. భారీగా మొక్కలు నాటేందుకు ప్లాన్..

సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్ నిర్మాణం కోసం ఢిల్లీ అటవీ శాఖ 6.63 హెక్టార్ల విస్తీర్ణాన్ని మినహాయించింది. ప్రాజెక్ట్ సైట్ నుండి 396 చెట్లను మార్పిడి చేయనుంది. ప్రతిపాదిత వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్ నార్త్ బ్లాక్ , రాష్ట్రపతి భవన్ పక్కన రానుంది. దీని కోసం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) సుమారు ₹ 214 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. జనవరి 14న విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాజెక్టు స్థలంలో 717 చెట్లు ఉండగా, అందులో 321 చెట్లను అలాగే ఉంచి, 396 మొక్కలను నాటారు. ప్రాజెక్టు పరిధిలో 135 చెట్లను నాటగా, సీపీడబ్ల్యూడీ తమ సొంత నిధులతో బదర్‌పూర్‌లోని ఎన్‌టీపీసీ ఎకో పార్క్ లో 261 చెట్లను నాటాలని కోరింది.

CPWD తెలిపిన ప్రకారం..సెంట్రల్ విస్టా కేంద్రంలోని 51 మంత్రిత్వ శాఖలలో 22 మాత్రమే కలిగి ఉంది. కొన్ని సందర్భాల్లో వివిధ భవనాల మధ్య మంత్రిత్వ శాఖ కార్యాలయాలు డివైడ్ చేశారు. ఢిల్లీ అంతటా మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఇలా ఉండడం వల్ల పరిపాలనా సామర్థ్యం దెబ్బతింటోంది. నిర్వహణ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అందుకని ఏకీకృత ఉమ్మడి కేంద్ర సచివాలయంలో మొత్తం 51 మంత్రిత్వ శాఖలకు ఆధునిక కార్యాలయాలు,సౌకర్యాలను కల్పించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement