Wednesday, April 24, 2024

ఏపీలో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 1,438 కోట్లు విడుదల

ఏపీలో రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 1,438 కోట్లను విడుదల చేసింది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 17 రాష్ట్రాలకు మొత్తం రూ. 9,871 కోట్లను మూడో విడత రెవెన్యూలోటు భర్తీ కింద విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు దక్కాయి. వీటితో కలుపుకుని రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ. 4,314.24 కోట్లు అందాయి.

కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 17 రాష్ట్రాలకు కలిపి రూ. 1,18,452 కోట్ల రెవెన్యూ గ్రాంటును విడుదల చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా, ఈ మొత్తాన్ని 12 వాయిదాల్లో చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మొత్తం వాయిదాల్లో కలిపి ఏపీకి మొత్తంగా రూ. 17,256.96 కోట్లు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement