Thursday, April 18, 2024

కరోనా కట్టడికి నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర కేబినెట్ నేడు సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై గత వారం రోజులుగా ప్రధాని దాదాపు ప్రతి రోజూ ఉన్నత స్థాయి అధికారులు, వైద్యులు, శాస్త్రవేత్తలతో సమావేశమవుతున్నారు. పది అలాగే పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్‌ విధానంలో సమావేశం సాగనుంది. సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ పరిస్థితులపై ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, టీకాలు, అవసరమైన ఔషధాలపై లభ్యత తదితర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement