Friday, April 19, 2024

తెలంగాణకు కేంద్రం అలర్ట్‌.. ఇన్ఫెక్షన్ల నివారణకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలోని పలు రాష్ట్ర్రాలలో కరోనా కేసులు మళ్లి పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని హెచ్చరించింది. ఇటీవలి కాలంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న జాబితాలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌, కర్నాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఇన్ఫెక్షన్లను నివారించేందుకు చర్యలు చేపట్టాలనిఈ రాష్ట్ర్రాలకు రాసిన లేఖలో సూచించారు. గతంలో కోవిడ్‌ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో సాధించిన విజయాల స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పని చేయాలని పేర్కొన్నారు.

- Advertisement -

టెస్ట్‌ , ట్రాక్‌, ట్రీట్‌ వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని అనుసరించాలని కేంద్రం కోరింది. కాగా, దాదాపుగా నాలుగు నెలల తరువాత దేశంలో అత్యధిక సంఖ్యలో కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజులోనే అత్యధికంగా 754 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో ఒక రోజు 734 కేసులు నమోదు కాగా, ఆ తరువాత అత్యధికంగా గురువారమే నమోదు కావడం గమనార్హం. కొత్తగా కరోనా మహమ్మారితో కర్నాటకలో ఒక వ్యక్తి మృతి చెందాడు.

ప్రస్తుతం 4633 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,92,710కి చేరగా, కోలుకున్న వారి సంఖ్య 4, 41, 57,297కి చేరింది. దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement