Thursday, April 25, 2024

‘పఠాన్‌’పై సెన్సార్‌ అభ్యంతరం.. మార్పులు చేయాలని ఆదేశాలు

షారుఖ్‌ ఖాన్‌, దీపికా పడుకొనే నటించిన ‘పఠాన్‌’ చిత్రంపై సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమానాలోని కొన్ని సన్నివేశాలను ముఖ్యంగా ‘బేషరమ్‌ రంగ్‌’ పాటలో హీరోయిన్‌ వస్త్రధారణపై అభ్యంతరాలు తెలియజేసింది. తక్షణమే మార్పులు చేయాలని చిత్ర నిర్మాతలకు సూచించింది. సీబీఎఫ్‌సీ చైర్‌పర్సన్‌ ప్రసూన్‌ జోషి మీడియాతో మాట్లాడుతూ… ‘పఠాన్‌’ సినిమా విడుదలకు ముందే చేపట్టిన సవరణలను సమర్పించాలని చిత్ర నిర్మాతలకు సూచించాం.

సినిమాను నిశితంగా పరిశీలించిన తర్వాత సెన్సార్‌ బోర్డు పలు మార్పులను సూచించింది” అని తెలిపారు. సెన్సార్‌ బోర్డు ఎల్లప్పుడూ సృజనాత్మకత, ప్రేక్షకుల సున్నితత్వానికి మధ్య సమతుల్యతను పాటిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement