Friday, March 29, 2024

ది ఘోస్ట్ మూవీకి -U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

ది ఘోస్ట్ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. దాంతో ఈ మూవీ సెన్సార్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ది ఘోస్ట్..ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోని యాక్షన్ దృశ్యాలు హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఉన్నాయన్న టాక్ వినిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement