Tuesday, October 15, 2024

TG | బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్..

తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూల‌ను పూజిస్తూ, ప్ర‌కృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌ల అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకు అందరూ కలిసి పండుగ జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, కష్టాలు తొలగిపోవాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement