Friday, April 19, 2024

క్రికెట్ ఫీల్డ్ లో అడుగుపెట్టనున్న సినీ తారలు.. వచ్చే నెల సిసిఎల్ మెగా లీగ్

భారతీయ సినిమాలోని ఎనిమిది ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను క్రికెట్ ఫీల్డ్ లోకి తీసుకువచ్చే బిగెస్ట్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్లీ తిరిగి వచ్చింది. సెలబ్రీటీల క్రికెట్ సందడి త్వరలోనే మొదలు కానుంది. మొత్తం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, భోజ్‌పురి, బెంగాలీ, పంజాబీలను క్రికెట్ మైదానంలోకి తీసుకువస్తుంది ఈ సెబ్రిటీ క్రికెట్ లీగ్.

కాగా, ఈ మెగా లీగ్ ఫిబ్రవరి 18, 2023 నుండి ప్రారంభమవుతుందని సీసీఎల్ వెల్లడించింది. పార్లే బిస్కెట్స్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌గా సైన్ అప్ చేసింది. ముంబై జట్టు బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్, కేరళ జట్టుకు మెంటార్‌గా మోహన్ లాల్, తెలుగు టీమ్‌కు వెంకటేష్ మెంటార్, బెంగాల్ జట్టు యజమానిగా బోనీ కపూర్ వ్యవహరిస్తున్నారు. క్రికెట్ ఫీల్డ్‌లో తమ హీరోలు సత్తా చాటాలని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఓ పండుగలా మారనుంది.

సీసీఎల్ పాల్గొనే ఎనిమిది జట్లు- కెప్టెన్:

- Advertisement -

• తెలుగు వారియర్స్-అఖిల్ అక్కినేని

• కేరళ స్ట్రైకర్స్-కుంచాకో బోబన్

• ముంబై హీరోస్-రితీష్ దేశ్‌ముఖ్

• కర్ణాటక బుల్డోజర్స్-కిచ్చా సుదీప్

• భోజ్‌పురి దబాంగ్స్ – మనోజ్ తివారీ

• చెన్నై రైనోస్ -ఆర్య

• బెంగాల్ టైగర్స్-జిషు సేన్‌గుప్తా

• పంజాబ్ డి షేర్-సోను సూద్

Advertisement

తాజా వార్తలు

Advertisement