Friday, April 19, 2024

ఉపాధిహామీ నిధులతో సీసీ రోడ్లు.. జిల్లాకు రూ. 4365 కోట్ల ఫండ్స్

కరీంనగర్, ప్రభన్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లకు మహర్దశ రానుంది. ఇన్నాళ్లూ నిదులు లేక మట్టిరోడ్లతో అవస్థలు పడిన గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు రాబోతున్నాయి. ఉపాధిహామీ నిధులతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వేగంగా పనులను పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. మారుమూల గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చేందుకు పరిపాలనాపరమైన అనుమతులను 6వ తేదీన పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement