Friday, March 29, 2024

వివేకా హత్య.. గంగిరెడ్డి పాత్రపై సీబీఐ ఫోకస్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు వేగం పెంచారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు కడప జిల్లా పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో.. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని విచారిస్తున్నారు. వివేకా వ్యక్తిగత కార్యదర్శి హిదయతుల్లానూ కూడా ప్రశ్నిస్తున్నారు. సాక్ష్యాల తారుమారు కేసులో రెండేళ్ల క్రితమే గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరోవైపు వివేకా హత్య కేసులో విషయంలో అధికార వైసీపీని టీడీపీ, టీడీపీలు టార్గెట్ చేశాయి. వైసీపీ విపక్షంలో ఉండగా పులివెందులలో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వైఎస్‌ కుటుంబాన్ని ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ హత్యలో వైఎస్‌ కుటుంబీకుల పాత్రపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడం, దీన్ని త్వరగా పూర్తి చేయాలని కూడా జగన్ కోరకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి రాక ముందు సీబీఐ దర్యాప్తు కోసం గట్టిగా డిమాండ్‌ చేసి, అధికారంలోకి వచ్చాక హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడంపైనా మౌనం వహిస్తున్న జగన్ తీరును విపక్షాలు తూర్పారపడుతున్నాయి. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కూడా ఇదే అంశంపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ హత్య కేసుతో తనకు సంబంధం లేదని, ఒకవేళ ఉందని నిరూపిస్తే ఉరి శిక్షకు కూడా రెడీఅంటూ ఇప్పటికే సవాల్ విసిరారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement