Wednesday, April 24, 2024

కార్ల్‌ – గ్యుస్టాఫ్‌ ఎం4 ఇండియాలోనే.. స్వీడన్‌ కంపెనీ సాబ్‌ ప్రకటన

కార్ల్‌ . గ్యుస్టాఫ్‌ ఎం4 వెపన్‌ను ఇండియాలోనే రూపొందించ నున్నట్లు స్వీడన్‌ రక్షణ రంగ ఆయుధాల తయారీ కంపెనీ సాబ్‌ మంగళవారం ప్రకటించింది. పాబ్‌ ఎఫ్‌ఎఫ్‌వి ఇండియా పేరుతో కొత్త కంపెనీ రిజిస్టర్‌ చేసినట్లు ఆ కంపెనీ బిజినెస్‌ హెడ్‌ గార్జెన్‌ జాన్సన్‌ ప్రకటించారు. వన్‌ వెపన్‌ ఎనీ టాస్క్‌ టాగ్యగ్‌లైన్‌ కలిగిన కార్ల్‌ గ్యుస్టాఫ్‌ ఎం4 వెపన్‌ ఏడు కేజీల కంటే తక్కువ బరువు కలిగి, ఒక్క మీటర్‌ పొడవు ఉంటుంది.

ఇది యాంటీ ఆర్మౌర్‌, యాంటీ స్ట్రక్చర్‌, యాంటీ పర్సనల్‌ వెపన్‌ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఈ ఆయుధంతో సైనికులు శత్రువును మట్టుబెట్టవచ్చు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పని ఏస్తుందని ఆ కంపెనీ వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఇండియన్‌ ఆర్మీకి సాబ్‌ కంపెనీ 1976 నుంచి సేవలందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement