Tuesday, April 23, 2024

Hyderabad : హుస్సేన్ సాగర్‌ తీరాన కార్‌ రేసింగ్‌ షో.. ఈ రూట్ల‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..!

హైద‌రాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించనున్న ట్రాక్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలున్నాయి. వీక్షించేందుకు వ‌చ్చే వారు ఇబ్బందుల‌కు గురికాకుండా ప్రతీ స్టాండ్‌కూ ప్రత్యేకంగా ఎంట్రీ గేట్లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌తి ఎంట్రెన్స్ వ‌ద్ద ప్ర‌త్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు కేటాయించామన్నారు. పార్కింగ్‌ ప్రాంతం నుంచి ఎంట్రీ గేటు వరకు చేర్చేందుకు షటిల్‌ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. మెట్రో, ఆర్టీసీలో ప్రయాణించే సందర్శకులు తమకు కేటాయించిన స్టాండ్‌కు చేరేందుకు ఆయా ఎంట్రీ గేట్‌లను వినియోగించుకోవాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. రేసింగ్‌ ట్రాక్‌ పరిసర ప్రాంతాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు. ట్రాఫిక్ ఆంక్ష‌లు 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు కొన‌సాగ‌నున్నాయి. ప‌లు మార్గాల్లో ఆంక్ష‌లు ఇలా… వీవీ విగ్రహం(ఖైరతాబాద్‌) వైపు నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు ట్రాఫిక్‌ అనుమతి లేదు. వీవీ విగ్రహం వద్ద షాదాన్ కాలేజ్‌, రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు.

బుద్దభవన్‌, నల్లంపట్ట జంక్షన్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్‌ నుంచి రాణిగంజ్‌, ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు. రసూల్‌పురా, మినిస్టర్‌ రోడ్డు నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్‌ వద్ద రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్‌ మినార్‌ నుంచి తెలుగుతల్లి జంక్షన్‌, ట్యాంక్‌ బండ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లాలి. ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌, రవీంద్ర‌ భారతి జంక్షన్‌ వైపు వెళ్లాలి. బీఆర్‌కే భవన్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌మినార్‌, రవీంద్ర‌ భారతి జంక్షన్‌కు మళ్లిస్తారు. ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ నుంచి మింట్‌కంపౌండ్‌ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర‌ భారతి జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వైపు నుంచి ప్రింటింగ్‌ ప్రెస్‌, నెక్లెస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేష్‌ వద్ద రాజ్‌దూత్‌ లైన్‌లోకి మళ్లిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement