Sunday, September 24, 2023

Car Crash: చెట్టును ఢీకొన్న‌ కారు.. న‌లుగురు స‌జీవ ద‌హ‌నం

చెట్టును ఓ కారు ఢీకొన‌డంతో ఆ కారులో మంటలు చెలరేగి న‌లుగురు స‌జీవ‌ద‌హ‌న‌మైన విషాద ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పెళ్లికి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈరోజు తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు ఒక చెట్టును వేగంగా ఢీకొన్నది. ఆ కారులో మంటలు చెలరేగ‌డంతో.. అందులో ఉన్న ఒక మహిళ, ముగ్గురు మగవారు మంటలంటుకున్న కారు నుంచి బయటకు రాలేకపోయారు.

- Advertisement -
   

దీంతో వారు మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. ఈ ప్ర‌మాద విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక శకటంతో సహా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఒక మహిళతో సహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement