Saturday, July 24, 2021

కారును ఢీకొన్న లారీ… నుజ్జునుజ్జు అయిన కారు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి చప్టావద్ద ఆదివారం కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మిట్టపాలెం గ్రామం నుంచి కారులో గోపు దుర్గ ప్రసాద్, కె భవాని, చంద్రిక, గోపు అనుపమ, యనసామి దుర్గ, డ్రైవర్ సయ్యద్ కోటప్పకొండ వెళుతున్నారు. కోటప్పకొండ వైపు నుంచి వస్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ నిద్రమత్తులో కారును ఢీ కొట్టాడు. కారు రోడ్డు పక్కన కంపచెట్లలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 సిబ్బంది ఈఎమ్ టి శోభన్ బాబు, పైలెట్ రాములు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేశారు.

ఈ వార్త కూడా చదవండి: సీఎం జగన్ నివాసం సమీపంలో ఫ్లెక్సీ కలకలం

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News