Saturday, June 19, 2021

వీడియో: పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా

హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నంబర్ 292 వద్ద శుక్రవారం మధ్యాహ్నం కారు బోల్తా పడింది. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కాసేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News