Saturday, December 10, 2022

ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే..?

విజయవాడ ఇంద్ర‌కీలాద్రిలో అధికారులు ఆల‌య‌ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈసారి భారీగా ఆదాయం వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో 17 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని ఆలయ ఈవో భ్రమరాంబ పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3,13,34,270 ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. 994 గ్రాముల బంగారం, 7.435 కిలోల వెండి వస్తువులను మొక్కుల రూపంలో చెల్లించుకున్నారని వివరించారు. ఈ హుండీ ద్వారా 55,623 ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement