Thursday, March 28, 2024

నేటితో ఉపఎన్నికల ప్రచారానికి తెర

తెలుగు రాష్ట్రాల్లో హీట్ ఎక్కిస్తున్న ఉప ఉఎన్నికల ప్రచారం నేటితో సమాప్తం కానుంది. ఏపీలోని తిరుపతి, తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే తిరుపతిలో అన్ని పార్టీల నేతలు ప్రచారం నిర్వహించారు. మాజీ సీఎం చంద్రబాబు ఏడు రోజుల పాటు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు. లోకేష్ అక్కడే మకాం వేసి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి ఏడుగురు మంత్రులు ప్రచార బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో సీఎం జగన్ సభను రద్దు చేసుకుని, తమ అభ్యర్థిని గెలిపించాలని లేఖల ద్వారా ఓటర్లను కోరారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్, జేపీ నడ్డా ప్రచారం చేశారు. ఈరోజు సాయంత్రంతో ప్రచారం ముగియనుంది.

అటు నాగార్జున సాగర్ లోనూ సీఎం కేసీఆర్ సభ బుధవారమే జరిగింది. అటు కాంగ్రెస్ అగ్రనేతలందరూ సాగర్‌లోనే మకాం వేశారు. బీజేపీ నుంచి బండి సంజయ్ ప్రచారం నిర్వహిస్తున్నా కొంచెం ప్రచారంలో వెనుకబడిందనే చెప్పాలి. ప్రచారం చివరి రోజు కావడంతో పార్టీలన్నీ ప్రలోభాలపై దృష్టి సారించాయి. ఓ ప్రధాన పార్టీ సాగర్ నియోజకవర్గంలో ఓటుకు రూ.2వేలు పంచడానికి వ్యూహరచన చేస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా నెలరోజులుగా పల్లెల్లో మద్యం, మాంసం పంపిణీ జోరుగా సాగుతోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement