Thursday, April 25, 2024

ఆక‌ట్టుకుంటోన్న‌.. బుట్ట‌బొమ్మ మూవీ ట్రైల‌ర్

బుట్ట‌బొమ్మ సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతోంది చైల్డ్ ఆర్టిస్ట్ అనికా సురేంద్ర‌న్. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా బుట్ట బొమ్మ.. సూర్యదేవర నాగ వంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.ఈ చిత్రంలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శౌరీ చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ.. మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు. ఇక ఈ సినిమా ఓ వీలేజ్‌ లవ్‌ స్టోరీ గా ట్రైలర్‌ చూస్తే అనిపిస్తోంది. అలాగే, ఈ ట్రైలర్‌ లో మంచి విజువల్స్‌, ప్రేమ బాగా చూపించారు.ఫిబ్రవరి 4వ తేదీన ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కాబోతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement