Monday, October 7, 2024

Odisha : బస్సు బోల్తా.. నలుగురు మృతి, 23మందికి గాయాలు

ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీ నుంచి పూరీకి ప్రయాణికులతో బస్సు వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు బాలేశ్వర్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 23మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement