Wednesday, April 24, 2024

హాలీవుడ్‌ వైపు బ‌న్నీ అడుగులు.. పుష్ప మూవీ చూసి ఫిదా అయిన గ్రేట్ డైరెక్ట‌ర్‌

‘పుష్ప’ సినిమా అనేక సంచలనాలకు కేంద్రబిందువు అయింది. అల్లు అర్జున్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. కెరీర్‌ పరంగా మరింత ఎదగడానికి దోహదం చేసింది. ఈ సినిమాకు సంబంధించిన అందరికీ పేరు తెచ్చింది. ఇప్పుడు ‘పుష్ప 2 ‘ మొదలైంది. అల్లు అర్జున్‌ ఇక ముందు కూడా తెలుగు సినిమాలే చేసినా అవి పాన్‌ ఇండియా మార్కెట్‌లో ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య అల్లు అర్జున్‌పై ఓ హాలీవుడ్‌ దర్శకుడు ఫిదా అయ్యాడట. పుష్ప సినిమా ఆయనకు తెగనచ్చేసింది. తన తాజా చిత్రంలో అల్లు అర్జున్‌ చేత ఓ పాత్ర చేయించాలని ముచ్చటపడినట్టు సమాచారం.

ఇటీవలే అల్లు అర్జున్‌ న్యూయార్క్‌లో ఉన్నప్పుడు సదరు దర్శకుడు కలిసినట్టు తెలిసింది. ఇంకా ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చలేదు కాబట్టి హాలీవుడ్‌ దర్శకుడు ఎవరనే వివరాలు వెల్లడికాలేదు. అల్లు అర్జున్‌ హాలీవుడ్‌ సినిమాలో నటిస్తే అది కూడా ఓ సంచలనే అవుతుంది. బాలీవుడ్‌ మాత్రమే కాదు హాలీవుడ్‌ సైతం టాలీవుడ్‌ వైపు చూడటం ఆసక్తి కలిగిస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement