Friday, April 19, 2024

స్టాక్‌మార్కెట్లకు బడ్జెట్‌ కీలకం.. పన్నులు తగ్గించాలని డిమాండ్‌

మన దేశంలో స్టాక్‌ మార్కెట్‌ కొన్ని లావాదేవీలపై పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ విధానం లేదు. ఈ పన్నులు తొలగిస్తే స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ పెరుగుతుందని, పెట్టుబడులు మరింత పెరుగుతాయని మార్కెట్‌ వర్గాలు ఆశాభావంగా ఉన్నాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, చైనాలో కొవిడ్‌ భయాలు, ఆర్ధిక మాంద్యం వస్తుందన్న అంచనాలు, ద్రవ్యోల్బణం ఇలా పలు కారణాలు అంతర్జాతీయ మార్కెట్లకు కుదిపేశాయి. దీని ప్రభావం మన దేశంలోని కంపెనీలపై కూడా పడింది. అయినప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొంత ప్రీమియంలోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మాంద్యం భయాలు ఎక్కువుతున్నందున 2023లో మార్కెట్లు మరింత సున్నితంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సారి బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీసుకోనున్న నిర్ణయాలు స్టాక్‌మార్కెట్లను, కోట్ల మంది ఇన్వెస్టర్ల ప్రయోజనాలను ప్రభావితం చేయనున్నాయి.

మన దేశంలో కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి సమయంలో స్టాక్‌ మార్కెట్లు పునాదులు బలపడ్డాయి. కొవిడ్‌ వ్యాప్తికి ముందు మార్చి 2020 నాటికి దేశంలో 4.9 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు ఉండగా, కొవిడ్‌ తరువాత 2022 నవంబర్‌ నాటికి ఇవి 10.4 కోట్లకు చేరాయి. రెండేళ్లలో వంద శాతానికి పైగా పెరిగాయి. దీంతో మార్కెట్‌లో పెట్టుబడులపై మధ్య తరగతి వర్గాల్లో ఆసక్తి పెరిగిందనే దానికి ఈ పెరుగుదలే నిదర్శనం. పెట్టుబడుల రూపంలో మన దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఇవి ప్రభావితం చేస్తున్నాయి.

ఎల్‌టీసీజీలో మార్పులు..

మన దేశంలో పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా మార్చాలంటే ఇప్పటికే ఉ్న ఎల్‌టీసీజీ ( దీర్ఘకాలిక మూలధన లాభాలు) పై పన్నును తొలగించాల్సిన అవసరం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల్లో ఏడాది దాటిన వాటి విక్రయాల్లో లక్ష కంటే ఎక్కువ లాభం వస్తే 10 శాతం పన్ను విధిస్తున్నారు. పన్ను విధించే లాభాల పరిధిని పెంచితే ఇన్వెస్టర్ల చేతికి మరిన్ని నిధులు అభించే అవకాశం ఉంది. మూడేళ్ల పాటు కొనసాగించిన పెట్టుబడులపై ఎల్‌టీసీజీ పూర్తిగా తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని రకాల మూలధన లాభాలపై ఒకే విధమైన పన్ను విధానం ఉంటే అది పన్ను చెల్లింపుదారులకు మరిన్ని నిధులను అందుబాటులోకి తీసుకు వస్తుంది. వాటిని పెట్టుబడుల రూపంలో మళ్లి ఉపయోగించే అవకాశం ఉందని వీరు చెబుతున్నారు.

- Advertisement -

ఎస్‌టీటీ తొలగించాలి..

సెక్యూరిటీల బదలాయింపు పన్ను (ఎస్‌టీటీ) కమోడిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(సీటీటీ)ని రద్దు చేయాలని కొన్నేళ్లుగా ది అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్స్ఛెంజ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎన్‌ఎంఐ) ప్రభుత్వాన్ని కోరుతున్నది. ప్రపంచంలో సీటీటీ, ఎన్‌టీటీపై పన్ను విధిస్తున్న ఏకైక దేశం భారత్‌ మాత్రమే. 2014లో ఎస్‌టీటీని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పన్ను ఆదాయంలో స్టాక్స్‌, ఈక్విటీపై వచ్చే మొత్తం కేవలం 2 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు పన్నలపై రిబేట్‌ విధానాన్ని అమలు చేస్తే మార్కెట్లో కార్యకలపాలు మరింత చురుగ్గా జరిగే అవకాశం ఉంది.

క్రిఎ్టోలపై మరింత స్పష్టత..

మన దేశంలో పర్ధాన స్పెక్యూలేషన్‌లో క్రిఎ్టో కరెన్సీ ట్రేడింగ్‌ కూడా అధికంగానే ఉంది. దేశంలో సుమారు 1.5 కోట్ల మంది క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 15 వేల కోట్ల మంది క్రిఎ్టోల్లో పెట్టుబడులు ఉండగా, ఈ రంగంలో 350 వరకు స్టార్టప్‌లు పని చేస్తున్నాయి. గత సంవత్సరం క్రిఎ్టో లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. మరో వైపు ఆర్బీఐలో కీలక అధికారులు మాత్రం క్రిఎ్టోలను నిషేధించాలని గట్టిగా కోరుతున్నారు. గత సంవత్సరం బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకే ఆర్బీఐ డి ప్యూటీ గవర్నర్‌ టి. రవి మాట్లాడుతూ క్రిఎ్టోలను నిషేధించడంలే భారత్‌కు సూచించదగిన అత్యుత్తమ మార్గమని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ కూడా వీటిని నిషేధించాలని కోరుతున్నారు. ద్రవ్య పరపతి సమీక్షలకు అతీతమైన స్థితికి ఇవి చేరుకుంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement