Thursday, April 25, 2024

దేశ రాజ‌కీయాల్లో భ‌విష్య‌త్ బీఆర్ఎస్ పార్టీదే : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలలో రోజురోజుకు విశ్వనీయత పెరుగుతున్నదని, దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తుందన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఎండీ ఖాలేద్ అహ్మద్.. మంత్రి జగదీశ్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితుల స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు తెలంగాణ‌లో విలీనం చేసుకోవాల‌ని కోర‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇప్ప‌టికే ప‌లువురు విన‌తి ప‌త్రాలను సైతం అందించ‌డం జ‌రిగింద‌న్నారు. బీజేపీ పాల‌న‌తో సంక్షేమం కుంటుప‌డింద‌ని ప్ర‌జ‌లు వాపోతున్నార‌న్నారు. సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ అదే పనిగా ఉదరగొడుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రజలు కూడా తాము తెలంగాణలో కలుస్తామంటున్నారని గుర్తు చేశారు. ఆపార్టీ ఏలుబడిలో ఉన్న కర్ణాటకలోని ప్రజలు సైతం ఇదే తరహాలలో కోరుతున్నారని ఉఠంకించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement