Thursday, April 25, 2024

రేపు ఖమ్మంలో బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌.. ఆ రూట్ల‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన, బహిరంగ సభ నిమిత్తం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్‌లు ఏర్పాటు చేశారు. మీటింగ్ వచ్చే ప్రజలు పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలిపి మీటింగ్ స్థలానికి చేరుకోవచ్చు.

భారీ వాహనాలదారి మళ్లింపు !
భారీ వాహనాలు వెళ్లే హైవే లో లారీలు, హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే డీసీఎంలు బోనకల్ చిల్లకల్లు వైపు మ‌ల్లించ‌నున్నారు.(పల్లిపాడు సెంటర్) (మ‌హ‌బాద్ ఎక్స్ రోడ్ రాంలీల ఫంక్ష‌న్ హాల్)
ఏనుకూరు నుంచి జన్నారం వైపు వెళ్లే భారీ వాహనాలను వైరా-బోనకల్ వైపు.
వైరా వైపు వస్తున్న భారీ వాహనాలు చింతకిని వైపు బోనకల్ రోడ్డు వైపు మళ్లించ‌నున్నారు.
ఇల్లందు వైపు నుంచి భారీ వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్ – రాపర్తినగర్ పాస్‌రోడ్డు మీదుగా హైద్, డబ్ల్యూఆర్‌ఎల్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
ఎన్ టీఆర్ సర్కిల్ లోని వాహనాలు… రాపర్తి నగర్‌లోని వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ రోడ్డుకు మళ్లింపు.
మహబూబాబాద్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఏదులాపురం, రూరల్ పీఎస్ సర్కిల్ వైపు కోదాడ వైపు నుంచి విజయవాడ హైవే వైపు మళ్లించారు.
(కోదాడ ఎక్స్ రోడ్ సర్కిల్, ఏదులాపురం ఎక్స్ రోడ్)
వరంగల్ వైపు నుంచి వస్తున్న భారీ వాహనాలు : రూరల్ పీఎస్ సర్కిల్ వైపు మళ్లించి కోదాడ వైపు నుంచి విజయవాడ హైవేకి మ‌ల్లించ‌నున్నారు.
హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వచ్చే భారీ వాహనాలు గుర్రాలపాడు – వెంకటగిరి ఎక్స్‌రోడ్డు – కోదాడ వైపు – విజయవాడ హైవే వైపు మ‌ళ్లించ‌నున్నారు.
(వెంకటగిరి ఎక్స్ రోడ్ జంక్షన్)
కోదాడ వైపు నుంచి వస్తున్న భారీ వాహనాలను ఖమ్మం టౌన్‌లోకి అనుమతించడం లేదు.
(నాయుడుపేట జంక్షన్ , ఏన్కూరు కేంద్రం, బోనకల్ సెంటర్)
ఖమ్మం టౌన్‌లో భారీ వాహనాలను అనుమతించడం లేదు. ఖమ్మం వెళ్లే వాహనాలను తిమ్మరావుపేట, ముచ్చర్ల ఎక్స్ రోడ్డు-ఎన్టీఆర్ సర్కిల్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. భారీ వాహనాలను ఖమ్మం రోడ్డుకు అనుమతించడం లేదు. కావున ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలందరూ వేరే మార్గాల ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement