రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్రంలో రైతు ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 27వ తేదీ (శుక్రవారం) సిద్దిపేట జిల్లా నంగునూరులో రైతు ధర్నా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రుణమాఫీ, రైతుబంధు, పంట బోనస్ కోసం రైతుల ధర్నా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కాగా, రైతు ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement