Monday, December 11, 2023

TS | ప్రచారంలో బీఆర్‌ఎస్‌ దూకుడు.. ఈ నెల 25న పరేడ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రతి రోజు మూడు నుంచి నాలుగు నియోజవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. గత తొమ్మిదిన్నరేండ్లలో ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వివరించడంతో పాటు బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

- Advertisement -
   

ఇందులో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని నియోజకర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలిరానున్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగా పరేడ్‌ గ్రౌండ్‌లో సభ నిర్వహణకు రక్షణ శాఖ అనుమతించింది. దీంతో సభ ఏర్పాట్లను గులాబీ పార్టీ ముమ్మరం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement