Monday, November 11, 2024

అక్క తల నరికిన తమ్ముడు.. తలతో సెల్ఫీ.. ఔరంగాబాద్‌లో దారుణం

ఔరంగాబాద్‌ : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు ఓ మహిళను ఆమె సోదరుడు, తల్లి దారుణంగా హతమార్చారు. కడుపుతో ఉందున్న విషయం మరిచిపోయి ఏకంగా ఆమె తలను నరికేశారు. అనంతరం ఆ తలను చేతిలో పట్టుకుని ఇంటి పరిసరాల్లో అటూ.. ఇటూ తిరిగాడు. ఆ పై తల్లిd కొడుకులు ఇద్దరూ.. సెల్ఫీలు తీసుకుని వికృతానందం పొందారు. ఆ పై పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి లొంగిపోయారు. విరాన్‌ పీఎస్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

కీర్తిథోర్‌ (19) ఈ ఏడాది జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. తమ అభీష్టాన్ని కాదని పెళ్లి చేసుకున్నందుకు అప్పటి నుంచే ఆమెపై గుర్రుగా ఉన్నారు. గతవారమే కీర్తి ఇంటికి ఆమె తల్లి వచ్చి వెళ్లింది. ఒకసారి పుట్టింటికి వచ్చి వెళ్లమని కోరింది. ఆదివారం మరోసారి తన కుమారుడితో కలిసి కూతురు ఇంటికి వచ్చింది. ఆ సమయంలో భర్త అనారోగ్యంతో వేరే గదిలో ఉన్నాడు. తల్లి, సోదరుడి కోసం టీ పెట్టడానికి వచ్చిన సమయంలో.. ఇద్దరూ ఆమె తలను నరికేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లిdకొడుకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement