Thursday, April 25, 2024

చిరంజీవి నివాసంలో బ్రిటన్ నూతన డిప్యూటీ కమిషనర్.. తెలుగు వంటకాలతో విందు..ఆవకాయ కూడా టేస్ట్ చేశారట

హైదరాబాద్ లో బ్రిటన్ నూతన డిప్యూటీ కమిషనర్ తో భేటీ కావడం ఆనందం కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ లో ఇప్పటి వరకు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరించారు. ఫ్లెమింగ్ పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాలకు బ్రిటన్ నూతన డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులైన గారెత్ విన్ ఓవెన్ కు తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు చిరంజీవి. సుహృద్భావ వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో బ్రిటన్, భారత్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాం. నా నివాసంలో ఆయనకు కొన్ని తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశాను. ఆవకాయను మర్చిపోలేదండోయ్ అంటూ చిరంజీవి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement