శ్రీశైలం నుండి మహబూబ్ నగర్ కి వెళ్తోన్నబస్సుకి పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలంలో టిఆర్ టిసి బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జలాశయం మలుపు దగ్గర ప్రహారీ గోడను ఢీ కొంది బస్సు. ఇనుప బారికేడు లేకపోతే లోయలో పడే ప్రమాదం ఉంది.దాంతో అప్రమత్తమై వెంటనే బస్సులోంచి దిగిపోయారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నారు. దాంతో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు అందరూ..బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -