Saturday, November 26, 2022

BREAKING : ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి… జిల్లాలోని కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి సమీపంలోని బెంగుళూరు-హైద‌రాబాద్ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్ర‌మాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. గాయ‌ప‌డిన చిన్నారులు హాసిని, సాహిత్‌లను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు గోపి, రమ్య, తారకేశ్వరిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement