Wednesday, March 29, 2023

Breaking : రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహా ధర్నా : ఎమ్మెల్సీ కవిత

కేంద్రం రైతు వ్య‌తిరేఖ విధానాల‌ను నిర‌సిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మ‌హా ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్న‌ట్లు, ఇందులో భాగంగా నిజామాబాద్ లో రైతు మహా ధర్నా చేప‌డుతున్న‌ట్లు ఎమ్మెల్సీ క‌విత అన్నారు. రైతు మ‌హా ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో రైతులు అధిక సంఖ్య‌లో పాల్గొని బీజేపీకి మ‌న స‌త్తా ఏంటో చూపిద్దామ‌న్నారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని, బీజేపీ పోరాటాలకు తలోగ్గుతారు.. కానీ బీఆర్ఎస్ పార్టీ పోరాటాల పార్టీ.. రైతుల కోసం దేనికైనా సిద్ధమే అన్నారు. ఒక ఏడాది బడ్జెట్ తో సమానమైన రూ.19 లక్షల కోట్ల రుణాలను కార్పొరేట్ వ్యాపారులు ఎగవేశారు. మహాత్మాగాంధీ ఉపధి హామీతో వ్యవసాయ పనులను అనుసంధానం చేయాల‌న్నారు. నల్లధనం ఎలాగూ తేలేరు, బ్యాంకులను లూటీ చేసిన వ్యాపారుల నుంచి వసూలు చేయాల‌న్నారు. కార్పొరేట్ లతో కాదు దేశంలోని పేదలతో కలిసి రావాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement