Friday, March 29, 2024

Breaking : కాంగ్రెస్ లో చేర‌నున్న క‌త్తి కార్తీక‌-రేపే ముహూర్తం

అధికార పార్టీలో అసంతృప్తులు ఎక్కువై కాంగ్రెస్ లోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఇతర పార్టీ నేతలే కాక స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి క్యూకట్టారు. మొన్నటికి మొన్న పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేపు శ‌నివారం కత్తి కార్తీక గౌడ్ గాంధీభవన్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేపు 11:00 గంటల సమయంలో పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క ల సమక్షంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.కాగా కార్తిక తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, రేడియో జాకీ, ఆర్కిటెక్. కార్తీక వి6 ఛానల్ లో “దిల్ సే కార్తీక” కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందింది. ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement