వైపీసీ పార్టీపై జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కూడా ఒక పార్టీయేనా అని, దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం కలిస్తే వైసీపీ అని విమర్శించారు. శనివారం నాగబాబు కర్నూల్ లో పర్యటించారు. జనసైనికులు, వీర మహిళల నుంచి సమస్యలను తెలుసుకోవడానికే తాను కర్నూలుకు వచ్చానని తెలిపారు. కర్నూలులో జనసేన నేతలు, కార్యకర్తలతో నాగబాబు సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఏపీలో టీడీపీతోనే జనసేనా పొత్తు పెట్టుకుంటుందని జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నాగబాబు స్మార్ట్ గా స్పందించారు. పొత్తు ఎవరితో అనేది మా పార్టీ అధ్యక్షుడు అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తాడన్నారు. పొత్తులు కుదిరిన తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పొత్తుల విషయంలో ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని పవన్ ప్రకటిస్తారని, పొత్తులు కుదరక ముందే పోటీ చేయబోయే స్థానాలపై మాడ్లాడటం అనవసరమని అన్నారు.
Breaking : వైసీపీ ఓ పార్టీనా.. నాగబాబు ఫైర్..

- Advertisement -
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement