Wednesday, March 27, 2024

Breaking: నిధులే ప్రధాన అజెండా… ప్రధాని మోదీతో ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ..

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ ముగిసింది. 45 నిమిషాలకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.ఏపీకి రావాల్సిన నిధులే ప్ర‌ధాన అజెండాగా సీఎం జ‌గ‌న్ మోదీతో చ‌ర్చించారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని, తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలు పరిష్కరించాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. విభజన జరిగి 8 ఏళ్లు గడిచిపోయాయి, ప్రత్యేక హోదాపై త్వరగా నిర్ణయం తీసుకోండని జగన్‌ కోరారు. ఇప్పటికీ చట్టంలో చాలా అంశాల్ని నేరవేర్చలేదని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని మోదీకి వివరించారు. పోలవరం పెండింగ్‌ నిధుల్ని వెంటనే ఇప్పించాలన్నారు. పునరావాసం కోసం అడహాక్‌గా రూ.10,485 కోట్లు.. పోలవరం ప్రాజెక్టు కోసం ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. పదో పేకమిషన్‌ బకాయిలు రూ.32,625.25 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఏపీకి పత్యేక హోదాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని మోదీని కోరారు. అదేవిధంగా కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement