Thursday, December 1, 2022

Breaking : గ‌డీల గూండాల దాడుల‌కు భయపడం : బండి సంజ‌య్

టీఆర్ఎస్ కు ప్ర‌జా స్వామ్యాన్ని ఎదుర్కొనే ద‌మ్ము లేక ఆ పార్టీ నాయ‌కులు భౌతిక దాడుల‌కు దిగుతున్నార‌ని తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజ‌య్ మండిప‌డ్డారు. ఎంపీ అర‌వింద్ ఇంటిపై దాడిని బండి సంజ‌య్ తీవ్రంగా ఖండించారు. అర‌వింద్ కి ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్నారు. బీజేపీ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే ద‌మ్ములేని ద‌ద్ద‌మ్మ‌లు టీఆర్ ఎస్ నేత‌లు అన్నారు. తెలంగాణ‌లో ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్కేయాల‌ని చూస్తున్నారు. గ‌డీల గూండాల దాడుల‌కు బ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. బీజేపీ నేత‌ల స‌హ‌యాన్ని చేత‌గాని త‌నం అనుకోవ‌ద్ద‌ని, మా కార్య‌క‌ర్త‌లు బ‌రిలోకి దిగితే మీరు త‌ట్టుకోలేర‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌లే టీఆర్ ఎస్ గూండాల‌కు బుద్ది చెబుతార‌ని బండి సంజ‌య్ అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement