Thursday, April 25, 2024

Breaking : ప్ర‌మాద‌క‌ర‌స్థితిలో రాయ్ చెరువు..సుర‌క్షిత ప్రాంతాల‌కు నాలుగు గ్రామాల ప్ర‌జ‌లు..

తిరుప‌తి రాయ‌ల్ చెరువుకు ప్ర‌మాదం పొంచి ఉంది. రాయ‌ల్ చెరువు నిండ‌టంతో ఏడు గ్రామాలు ముంపున‌కు గుర‌య్యాయి. కాలేప‌ల్లి,సూరాళ్ల‌ప‌ల్లి,రాయ‌ల్ చెరువుపేట‌,చిట్ట‌తూరు నీట‌మునిగాయి. నాలుగు గ్రామాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇన్ ఫ్లో కంటే ఔట్ ఫ్లో త‌క్కువ‌గా ఉండ‌టంతో ఆందోళ‌న‌లో బ‌లిజ‌ప‌ల్లి,సంజ‌య‌రావుపురం,పీవీపురం,గంగిరెడ్డిప‌ల్లి ప్ర‌జ‌లు ఉన్నారు. గ్రామాల మ‌ధ్య వివాదంగా మారింది రాయ‌ల్ చెరువు. కాగా చెరువుకు గండికొట్ట‌డంపై గ్రామ ప్ర‌జలు భిన్న వాదన‌లు వినిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement