Thursday, April 18, 2024

ఆలియాభ‌ట్ పై ర‌ణ్ బీర్ క‌పూర్ బాడీ షేమింగ్ – ఫైర్ అవుతోన్న నెటిజ‌న్స్

వివాహం త‌ర్వాత బాలీవుడ్ న‌టులు ర‌ణ్ బీర్ క‌పూర్..ఆలియాభ‌ట్ కలిసి న‌టించిన చిత్రం బ్ర‌హ్మాస్త్ర‌.ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్‌‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా ఆలియా భట్‌‌పై రణ్‌బీర్‌ కపూర్‌ చేసిన ఓ కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఓ అభిమాని .. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రమోషన్స్‌ పూర్తిస్థాయిలో ఎందుకు జరగడం లేదని అడిగాడు. త్వరలోనే అన్ని ప్రాంతాలకు వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేస్తామని సమాధానం ఇచ్చింది ఆలియా భట్.

ఇంకా ఆమె ఏదో చెప్పబోతుండగా.. మధ్య రణ్‌బీర్ కలుగజేసుకున్నాడు. తమ సినిమాను ఎందుకు ప్రమోట్ చేయడం లేదంటే.. ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారంటూ కామెంట్ చేశారు. దీంతో ఆలియా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే తెరుకున్న రణ్‌బీర్‌.. తాను కేవలం జోక్ చేశానంటూ కవర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింగ తెగ వైరల్ అవుతోంది.ఈ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో సెప్టెంబర్ 9న ఆడియన్స్ ముందుకు రానుంది.ఓ ప్రెగ్నెంట్ మహిళను ఇలా అంటావా అంటూ ఫైర్ అవుతున్నారు. గతంలో హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి హేళనగా మాట్లాడావని.. ఇప్పుడు ఆలియా బాడీ షేమింగ్ చేస్తున్నావంటూ ట్రోల్ చేస్తున్నారు. రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకుని తప్పు చేశావు ఆలియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీకు ఇంతకంటే మంచి వ్యక్తి భర్తగా వచ్చేవాడని ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement