Thursday, April 25, 2024

బ్ర‌హ్మాస్త్ర చిత్రం నుండి – కుంకుమాల సాంగ్ టీజ‌ర్ రిలీజ్

అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం బ్ర‌హ్మాస్త్ర‌. మూడు భాగాలుగా తెర‌కెక్కిన ఈ చిత్రం మొద‌టి భాగం శివ.. హిందీతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్‌ క‌పుల్ ర‌ణ్‌బీర్ సింగ్‌, అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు..తెలుగులో ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వ్య‌వ‌హరిస్తున్నాడు. రాజ‌మౌళి ఈ చిత్రంలో భాగం కావ‌డంతో సినిమా క్రేజ్ రెట్టింపు అయింది. గ‌త నెల‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల‌లో బిజీగా ఉంది. మైథ‌లాజిక‌ల్ అడ్వెంచ‌రస్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం అప్‌డేట్‌ల‌ను మొద‌లు పెట్టింది. తాజాగా ఈ చిత్రంలోని ‘కుంకుమాల’ సాంగ్ టీజ‌ర్‌ను రాజ‌మౌళి విడుద‌ల చేశాడు.లేటెస్ట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్ వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌లో ర‌ణ్‌బీర్‌, అలియాల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సిద్ శ్రీ రామ్ వాయిస్ అద్భుతంగా ఉంది. ప్రీతమ్ స్వ‌ర పరిచిన ఈ మెలోడియ‌స్ సాంగ్‌కు చంద్ర‌బోస్ సాహిత్యం అందించాడు. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌బ‌చ్చ‌న్‌, నాగార్జున అక్కినేని, మౌనీరాయ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement