Saturday, April 20, 2024

వాల్తేరు వీరయ్య సాంగ్ బాస్ పార్టీకి.. 9మిలియన్ల వ్యూస్

రీసెంట్ గా వాల్తేరు వీరయ్య చిత్రం నుండి బాస్ పార్టీ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటికే 9 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుందని తెలిపింది చిత్రబృందం. అంతేకాదు ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోందని ఓ ట్వీట్ చేసింది. ఈ పాటలో చిరంజీవి లుంగీలో ఊర మాస్ గెటప్‌లో ఓ రేంజ్‌లో ఉన్నారు. అభిమానులు ఈ కటౌట్‌ చూసి ఫిదా అవతున్నారు.ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అంతేకాదు లిరిక్స్ కూడా ఆయనే రాశారు. నాకాష్ అజీజ్, హరిప్రియ, దేవిశ్రీ ప్రసాద్ పాడారు. పాట మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక అది అలా ఉంటే ఈ పాటపై ఫ్యాన్స్ కాస్తా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాట కామెడీగా ఉందని అంటున్నారు. ఇక కొందరు నెటిజన్స్ ఏకంగా పాటను ట్రోల్ చేస్తున్నారు. ఈ పాట ఏంటీ ఇలా ఉందంటున్నారు. ఏది ఏమైనా పాటకు రావాల్సిన పబ్లిసిటీ మాత్రం వచ్చింది. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయినట్టు సమాచారం. దీంతో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement