Sunday, January 23, 2022

ఆర్టీసీ బస్సులో జన్మించారు.. బ‌ర్త్ డే గిఫ్ట్ ఏంటంటే…

ప్ర‌భ‌న్యూస్ : ఆర్టీసీ బస్సులలో ఇటీవల జన్మించిన ఇద్దరు ఆడ పిల్లలు తమ బర్త్‌డే గిఫ్ట్‌గా సంస్థ నుంచి ఉచిత బస్‌పాస్‌లను పొందనున్నారు. నాగర్‌ కర్నూల్‌ డిపోకు చెందిన బస్సులో పెద్ద కొత్తపల్లి గ్రామ సమీపంలో నవంబర్‌ 30 వ తేదీన మొదటి ఆడపిల్ల జన్మించగా, డిసెంబర్‌ 7 వ తేదీ మధ్యాహ్నం ఆసిఫాబాద్‌ డిపోకు చెందిన బస్సులో మరో మహిళ కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ ఇద్దరు మహిళలు ఊహించని విధంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకునేలోపే ప్రసవించడం జరిగింది. ఆర్టీసీ సిబ్బంది, తోటి ప్రయాణికుల సహాయంతో వారు పండండి బిడ్డలకు జన్మనిచ్చారు.

అనంతరం ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తల్లలుు, నవజాత శిశువులను తదుపరి చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. బస్సులలో బిడ్డలు జన్మించారని, వారు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఎండీ సజ్జనార్‌ ఇద్దరు శిశువులకు జీవితకాలం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసేందుకు వీలుగా పాస్‌లను అందించాలని నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News