Thursday, April 25, 2024

బోర్డర్​లో ఘోరం.. సహచరులపై ఫైరింగ్​ చేసిన ఆర్మీ జవాన్​

ఓ ఆర్మీ జవాన్​ డ్యూటీలో ఉన్న తన దోస్తులిద్దరిపై ఫైరింగ్​ చేసి తనపై తానే కాల్పులు చేసుకున్నాడు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఇవ్వాల (శనివారం) జరిగింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) అయిన తను.. ముగ్గురు సహచరులను కాల్చి, తనను తాను కాల్చుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించింది. జిల్లాలోని దేవిక ఘాట్ కమ్యూనిటీ సెంటర్ వద్ద ఇవ్వాల మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

J&Kలో గత 24 గంటల్లో ఇది రెండో అతిపెద్ద హత్య ఘటనగా అధికారులు తెలిపారు. శుక్రవారం పూంచ్‌లో జరిగిన ఇట్లాంటి ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కానిస్టేబుల్ భూపేంద్ర సింగ్ తన సహోద్యోగులపై కాల్పులు జరపడంతో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ITBP సీనియర్ అధికారి ధ్రువపరిచారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్​ అందించామని, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అధికారి తెలిపారు. కానిస్టేబుల్ ఫోర్స్ లోని 8వ బెటాలియన్‌కు చెందినవాడు. ప్రస్తుతం భద్రతా విధుల కోసం జమ్మూ కాశ్మీర్‌లో మోహరించిన ITBP యొక్క 2వ తాత్కాలిక బెటాలియన్‌కు చెందిన ‘F’ కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement