Sunday, December 8, 2024

TG | మావోయిస్టుల డంప్ స్వాధీనం

ములుగు ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ములుగు జిల్లా తాడ్వాయి మండ‌ల బంధాల రిజ‌ర్వు అట‌వీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాల డంప్‌ను శుక్ర‌వారం ప‌ద‌కొండు గంట‌ల‌కు బాంబు డిస్పోజ‌ల్ (బీడీ) టీమ్ స‌భ్యులు స్వాధీనం చేసుకున్నారు.

విశ్వాస‌నీయ స‌మాచారం మేర‌కు అట‌వీ ప్రాంతంలో బీడీ టీమ్ గాలించారు. ములుగు పోలీసుల స‌హ‌కారంతో బీడీ టీమ్ స‌భ్యుల బృందాలు అనుమానాస్ప‌ద ప్రాంతాల‌ను సోదాలు చేశారు. మావోయిస్టులు అమ‌ర్చిన ఆయుధాల డంప్ను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ డంప్‌లో 7.62 ఎంఎం సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌, 7.62 ఎంఎం సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌(బెల్జియం మోడ‌ల్‌), 30-06 ఎంఎం స్ప్రింగ్‌ఫీల్డ్, 7.62 ఎంఎం సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ రౌండ్లు-108, 30-06 ఎంఎం స్ప్రింగ్‌ఫీల్డ్ రౌండ్లు -30, 8 ఎంఎం 25 రౌండ్లు బులెట్లు, 12 బోర్ కాట్రిడ్జ్‌లు-02, మావోయిస్టుల సాహిత్యం, పౌచ్‌లు ఉన్నాయి. మొత్తం మూడు తుపాకులు మరియు 165 లైవ్ రౌండ్స్ ని స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఎస్‌పీ డాక్ట‌ర్‌ శ‌బ‌రీస్ మాట్లాడుతూ.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు లు స్వ‌చ్ఛందంగా లొంగి పోవాలని, వారికి ప్రభుత్వం తరపున పునరావసం కల్పిస్తామని ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement