Saturday, April 20, 2024

ఇది ఆరంభం మాత్రమే- హోమ్ మంత్రి రాజీనామాపై కంగన సెటైర్

అవినీతి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరగాలని బొంబాయి హైకోర్టు ఆదేశించడం తో మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు కేంద్ర ఏజెన్సీని ఆదేశించింది. అనంతరం హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేసినట్లు ఎన్ సిపి మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. అయితే ఈ వివాదం పై బాలీవుడ్ హాట్ బ్యూటీ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.

స్త్రీలను వేధించే హింసించే వారికి ఎప్పటికైనా పతనం తప్పదు. ఇది ఆరంభం మాత్రమే.. ముందు ముందు భవిష్యత్తు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో మహారాష్ట్ర సర్కార్ పై కంగనా రనౌత్ పలుమార్లు విరుచుకు పడిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement