Friday, April 19, 2024

పెళ్ల‌యినా దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి – ర‌ణ్ బీర్ క‌పూర్

బాలీవుడ్ స్టార్స్ ర‌ణ‌బీర్ క‌పూర్..ఆలియాభ‌ట్ ల‌కి రీసెంట్ గా మ్యారేజ్ జ‌రిగింది. అయితే పెళ్లికి ముందు వీరు క‌మిట్ అయిన ప్రాజెక్టుల వ‌ల్ల ఈ కొత్త జంట దూరంగా ఉంటున్నారు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్‌ స్టార్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌- ఆలియా భట్‌ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు రోజుల్లోనే తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. పెళ్లి తర్వాత లైఫ్‌ ఏమైనా మారిందా అన్న ప్రశ్నకు తాజాగా రణ్‌బీర్‌ ఇలా స్పందించారు.మా జీవితాల్లో పెద్దగా మార్పు కనిపించట్లేదు. ఐదేళ్లుగా కలిసుంటున్నాం, కాబట్టి ఇక పెళ్లి చేసుకుందామనుకున్నాం, చేసుకున్నాం. కానీ ఇప్పటికే సైన్‌ చేసిన ప్రాజెక్ట్‌లు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో మొదట వాటిని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టాం. పెళ్లైన తర్వాతి రోజే మేం షూటింగ్స్‌తో బిజీ అయ్యాం. అలియా తన మూవీ షూటింగ్‌లో నేను మనాలీలో నా సినిమా షూటింగ్‌లో ఉండిపోయాం. అలియా తన హాలీవుడ్‌ మూవీ షూటింగ్‌ ముగించుకుని లండన్‌ నుంచి ఎప్పుడైతే తిరిగొస్తుందో అప్పుడు మేం కొంత బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నాం. అది కూడా నేను నటించిన షంషేరా మూవీ రిలీజయ్యాకే ఏదైనా హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేస్తాం. ప్రస్తుతానికైతే మాకింకా పెళ్లి కానట్లే అనిపిస్తోంద‌న్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement