Saturday, April 20, 2024

బాలీవుడ్ లోకి మ‌రో వార‌సురాలు..

ఇప్ప‌టికే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతోమంది వార‌సులు వ‌చ్చారు..వ‌స్తున్నారు. కాగా బాలీవుడ్ లోకి మ‌రో వార‌సురాలు ఎంట్రీ ఇస్తోంది. ఆమె మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ సీనియ‌ర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని.. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇప్పటికే సందడి చేస్తోంది. ఫాలోయింగ్ తో పాటు.. రవీనా కూతురిగా ఇమేజ్ కూడా ఉండటంతో బాలీవుడ్ ఎంట్రీకి ఆమెకు రూట్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. దాంతో త్వరలోనే ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. రాషా తడానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా.. ఈసినిమాతో హీరో అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్ హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు జంటగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టబొతున్నారు. ఈ యంగ్ కపుల్ ఎంట్రీ మూవీని అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఈ సమాచారం. ఈ సినిమా కథ రాషా వినడం.. అంతా ఓకే అయిపోయి సైన్ చేయడం కూడా అయిపోయిందని సమాచారం. అంతే కాదు ఈసినిమాలో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడట. అజయ్ దేవ్ గణ్ మునుపెన్నడు కనిపించనంత వెరైటీ పాత్రలో కనిపించనున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement