Wednesday, November 6, 2024

Anil Arora Suicide: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య…

బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా తండ్రి అనిల్ అరోరా అత్మ‌హ‌త్య చేసుకున్నారు.. ముంబై – బాంద్రాలో ఇవాళ ఉదయం ఏడోవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు, క్రైం బ్రాంచ్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటనా ప్రదేశంలో ఎలాంటి సూసూడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే, గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.. ఘటన జరిగిన సమయంలో మలైకా అరోరా ఇంట్లో లేరు. ప్రస్తుతం పూణెలో ఉన్న ఆమె సమాచారం అందుకున్న వెంటనే ముంబైకి బయలుదేరారు. అనిల్ అరోరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement