Friday, March 29, 2024

బాడీ బిల్డ‌ర్ అరోరా ఇక‌లేరు.. గుండెపోటుతో మృతి

మాజీ మిస్టర్ ఇండియా, ప్రఖ్యాత బాడీబిల్డర్ ప్రేమ్‌రాజ్ అరోరా.. 42 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో చ‌నిపోయారు. ఎప్ప‌టిలాగానే త‌న వ‌ర్కౌట్ రొటీన్ ముగించుకుని బాత్రూమ్‌లోకి వెళ్లారు అరోరా.. అయితే ఎంత సేపటికీ అత‌ను బ‌య‌టికి రాకపోవ‌డంతో కుటుంబ సభ్యుల తలుపు బద్దలు కొట్టి లోప‌లికి వెళ్లారు. షవర్ కింద అపస్మారక స్థితిలో ప‌డి ఉన్నాడు అరోరా. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్ప‌టికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

నాగ్‌పూర్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో పాటు 2012-13లో రాజస్థాన్ బెస్ట్ పవర్ లిఫ్టింగ్… 2014లో మిస్టర్ ఇండియా టైటిల్‌తో సహా తన ఫిట్ బాడీకి అనేక అవార్డులను గెలుచుకున్నాడు అరోరా. అతను రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన ఈవెంట్లలో 2016-17లో రెండు మిస్టర్ ఇండియా టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement