Sunday, March 24, 2024

బీఎండబ్ల్యూ విద్యుత్‌ కారు వచ్చేసింది…

న్యూఢిల్లి : జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ కారు సెడాన్‌ ఐ4ని భారత్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ డ్రైవ్‌ను వేగవంతం చేసేందుకు రూ.69.9 లక్షల ప్రారంభ ధరతో ఈ కారును తీసుకొచ్చింది. వచ్చే ఆరునెలల్లో మూడు విద్యుత్‌ వాహనాలు తీసుకొస్తామని నిరుడు నవంబర్‌లో బీఎండబ్ల్యూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ కొత్త కారును ఆవిష్కరించింది. సెడాన్‌ ఐ4ను పూర్తి స్థాయిలో నిర్మించి దిగుమతి చేయనుంది.

ఐదో తరం బీఎండబ్ల్యూ ఈడ్రైవ్‌ టెక్నాలజీ కలిగిన ఈ వాహనం ఎలక్ట్రిక్‌ మోటార్‌, సింగిల్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ డ్రైవ్‌ యూనిట్‌ను కలిగి ఉంది. 340హెచ్‌పీ అవుట్‌పుట్‌తో ఈ వాహనం నడుస్తుంది. 5.7 సెకన్లలోనే 0 నుంచి గంటకు వంద కిలోమీటర్ల స్పీడ్‌ అందుకుంటుంది. ఇందులో లిథియం-అయాన్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ వాహనాల బుకింగ్‌ ప్రారంభమైందనీ, ఈ ఏడాది జులై నుంచే డెలివరీ ప్రారంభమవుతుందని కంపెనీ వర్గాలు తెలియజేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement