Thursday, April 18, 2024

బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ ! ట్వట్టర్ దారిలో ఇన్‌స్టాగ్రామ్..

సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ట్విట్టర్ లాగానే ఇక్కడ కూడా ప్రముఖ వ్యక్తుల ప్రోఫైల్ కు బ్లూ టిక్‌ గుర్తు ఉంటుంది. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తరువాత, బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. మెటా యాజమాన్యం కూడా ట్విట్టర్ దారిలోనే నదవనున్నట్టు కనిపిస్తోంది. ఎకౌంట్ ప్రోఫైల్ వెరిఫికేషన్ కోసం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మెటా టెక్ దిగ్గజం ట్విట్టర్ ని అనుసరిస్తే.. ఈ పెయిడ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇన్‌స్టాగ్రామ్ & ఫేస్‌బుక్ రెండింటికి వర్తిస్తోంది. అయితే, ప్రస్తుతానికి, టెక్ దిగ్గజం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

కాగా, యూజర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ (బ్లూ టిక్) కోసం ట్విట్టర్ వినియోగదారులు నెలకు $8 చెల్లిస్తున్నారు. ఈ పేయిడ్ వెరిఫికేషన్ ద్వారా ప్రముఖులే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా ఈ బ్లూ టిక్ ని కొనుగోలు చేసుకోవచ్చు. ఒకవేల ఇన్‌స్టాగ్రామ్ కూడా ట్విట్టర్ స్టైల్ ను ఫాలో అయ్యి వెరిఫికేషన్ బ్యాడ్జ్ కు సబ్‌స్క్రిప్షన్‌ స్టార్ట్ చేస్తే.. నెట్‌వర్క్‌లోని ఎవరైనా బ్లూ టిక్ మార్క్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

- Advertisement -

ఇక దీంతో పాటు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ కొత్త క్యాండిడ్ స్టోరీస్ ఫీచర్‌పై ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వారి రోజువారీ కార్యకలాపాలను రికార్డ్ చేసి షేర్ చేసుకోడానికి అనువుగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement