Friday, April 19, 2024

ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం కింద బ్లాక్ ఫంగస్‌కు చికిత్స

ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కీలక ప్రకటన చేశారు. కరోనా రోగుల పాలిట పెనుముప్పుగా పరిణమించిన బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కారణంగా కరోనా రోగులు కంటిచూపు పొగొట్టుకోవడమే కాకుండా, కొన్నిసార్లు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో, బ్లాక్ ఫంగస్‌పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇకపై బ్లాక్ ఫంగస్ సోకినవారికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.

మరోవైపు ఏపీలో కర్ఫ్యూ విధించడం వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారని వివరించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే చేపడుతున్నామని, తద్వారా కరోనా బాధితులను గుర్తించడం సులువు అవుతుందన్నారు. సర్వేలో గుర్తించిన పాజిటివ్ వ్యక్తులను వారిలో లక్షణాల తీవ్రతను బట్టి ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆళ్ల నాని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement